గ్రేటర్లో రోడ్డెక్కిన అడ్వొకేట్స్

 గ్రేటర్లో రోడ్డెక్కిన అడ్వొకేట్స్
  • స్వప్న హత్యకు నిరసనగా ఆందోళనలు
  • ప్రొటెక్షన్​ యాక్ట్​ కోసం డిమాండ్​ 

హైదరాబాద్​సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలం కేతిరెడ్డిపల్లిలో జరిగిన న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ నగర వ్యాప్తంగా అడ్వొకేట్స్ రోడ్డెక్కారు. నాంపల్లి, కూకట్​పల్లి, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్​, మేడిపల్లి తదితర కోర్టుల్లో విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. హైకోర్టు అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.వెంటనే అడ్వొకేట్​ప్రొటెక్షన్​యాక్ట్​ తేవాలని డిమాండ్​చేశారు. 

డీజీపీకి వినతిపత్రం  

జూబ్లీహిల్స్ : న్యాయవాది స్వప్న హత్య కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, సీనియర్ అడ్వొకేట్​వై. కొండల్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. న్యాయవాదులు సంజీవరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాయిని రవీందర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, వినీత్ రెడ్డి, మల్లిక 
పాల్గొన్నారు.