అక్రమ అరెస్టులపై బీజేపీ నేతలు సీరియస్

అక్రమ అరెస్టులపై బీజేపీ నేతలు సీరియస్

మంచిర్యాల బీజేవైఎం జిల్లా  అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణను పోలీసులు అరెస్టు చేయడంపై వివాదం రేగుతోంది. వెంకటకృష్ణను అక్రమంగా అరెస్ట్ చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. వెంకటకృష్ణను ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్ లో ఉంచారో కూడా పోలీసులు చెప్పడం లేదన్నారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంకటకృష్ణ అరెస్టును బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఖండించారు. బీజేపీ నేతల్ని పోలీసులు వేధిస్తున్నారని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారన్న సమాచారంతోనే వెంకటకృష్ణను పోలీసులు పట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం:

తెలుగు షోలలో ‘అన్‌స్టాపబుల్‌’

మోడీ జీ.. 15 నిమిషాలు ఆగలేరా?

ఒమిక్రాన్ పై WHO హెచ్చరిక