రైతులు ఏడాది ఉన్నరు.. మోడీ జీ 15 నిమిషాలు ఆగలేరా?

రైతులు ఏడాది ఉన్నరు.. మోడీ జీ 15 నిమిషాలు ఆగలేరా?

చండీగఢ్: పంజాబ్ లో బుధవారం జరిగిన ఘటనపై పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏడాది పాటు ధర్నా చేస్తూ ఉండిపోయారని.. కానీ మోడీ 15 నిమిషాలు వేచి ఉండటానికీ ఇబ్బంది పడ్డారని విమర్శించారు. ఇంత ద్వంద్వ ప్రమాణాలు తగునా అని నిలదీశారు. మోడీని పంజాబీలు అస్సలు నమ్మరన్నారు. రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ.. ఉన్న ఆదాయాన్నీ లాగేసుకున్నారని ఆరోపించారు. 

మోడీ పర్యటనలో భద్రతాపరమైన లోపాలున్నాయన్న బీజేపీ ఆరోపణలపై సిద్ధూ ఘాటుగా బదులిచ్చారు. ‘ప్రధాని సభకు ప్రజలు రాలేదు. దీన్ని ఆయన కప్పి పుచ్చుతున్నారు. కావాలనే భద్రతా లోపం అంటూ మా ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు’ అని సిద్ధూ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని సభకు 70 వేల మంది కోసం కుర్చీలు వేశారని.. అయితే 500 మంది మాత్రమే వచ్చారని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ లో బీజేపీ ర్యాలీ పూర్తిగా ఫ్లాప్ అయ్యిందన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కరోనా భయపెడుతోంది.. సభలు, రోడ్ షోలు వద్దు

పోలీసుల విచారణకు రాఘవను అప్పగిస్తా

కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూ