అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో.. హైదరాబాద్ లో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు సూసైడ్

అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో.. హైదరాబాద్ లో  ఒకే ఫ్యామిలీలో ముగ్గురు సూసైడ్

 

చనిపోయి మంచంపై పడి ఉన్న భార్య.. ఉరేసుకున్న భర్త
చేయి కోసుకున్న కొడుకు.. అయినా చనిపోకపోవడంతో ఉరి  
సూసైడ్ నోట్​ లభ్యం.. హైదరాబాద్​ అంబర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో దారుణం 
బిర్యానీ రెస్టారెంట్‌‌‌‌లో వచ్చిన నష్టాలే కారణం!

అంబర్‌‌‌‌‌‌‌‌పేట, వెలుగు: అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రూములో భార్య మంచంపై  చనిపోయి ఉండగా, మరో రూమ్​లో భర్త ఉరేసుకుని కనిపించాడు. కొడుకు చేతి మణికట్టును కత్తితో కోసుకుని చనిపోవాలనుకున్నాడు. కానీ, రక్తం మెల్లిగా పోవడం, ఎంతకీ ప్రాణం పోకపోవడంతో చివరికి అతడు కూడా ఉరేసుకుని తనువు చాలించాడు.  ఈ విషాద ఘటన హైదరాబాద్ ​అంబర్‌‌‌‌పేట్‌‌‌‌లోని బాపునగర్ కాకతీయ బజార్‌‌‌‌లో మంగళవారం జరిగింది. 

నగరానికి చెందిన కడిగేకర్ రామరాజు(54), మాధవి (50) భార్యాభర్తలు.. వీరికి కొడుకు శశాంక్ రాజ్(27), కూతురు అమూల్య ఉన్నారు. అమూల్యకు ఏడేండ్ల కిందటే పెండ్లయ్యింది. రామరాజుకు అంబర్‌‌పేట్ బాపునగర్ కాకతీయ బజార్‌‌లో మూడు అంతస్తు ల బిల్డింగ్ ​ఉంది. గ్రౌండ్​ ఫ్లోర్‌‌‌‌ను రెంట్‌‌కు ఇచ్చా రు. మొదటి అంతస్తులో రామరాజు తమ్ముడు, అతడి కుటుంబం ఉంటున్నది. రెండో ఫ్లోర్‌‌‌‌లోని డబుల్ బెడ్​రూమ్‌‌లో రామరాజు కొడుకు, భార్యతో ఉంటున్నాడు. మూడేండ్ల కింద రామంతాపూర్‌‌‌‌లో కొంతమంది పార్ట్‌‌ నర్స్​తో కలిసి ల్యాండ్‌‌మార్క్ హోటల్‌‌లో పెట్టుబడి పెట్టాడు. అది నష్టాలు రావడంతో అందులో నుంచి బయటకు వచ్చా డు. ఏడాది కింద అప్పు చేసి తన కొడుకు శశాంక్‌‌తో కలిసి మల్లాపూర్‌‌లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ పెట్టాడు. ఇది కూడా ఆశించినట్టు నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీంతో రామరాజు కొన్ని రోజులుగా డిప్రెషన్‌‌లో ఉంటున్నాడు.  ఆర్థిక ఇబ్బందు ల నుంచి బయటపడే అవకాశం లేకపోవడం, అప్పులు తీరే దారి లేక ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. 

చనిపోతున్నాం అని ఫ్రెండ్‌‌కు మెసేజ్.. 

శశాంక్​ తన ఫ్రెండ్​ రవికి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ‘అందరం సూసైడ్ ​చేసుకుంటున్నం’ అని మెసేజ్​ చేశాడు. అయితే, ఆ మెసేజ్‌‌ను రవి ఉదయం 8 గంటలకు చూశాడు. వెంటనే వారికి ఫోన్ చేశాడు. లిఫ్ట్​ చేయకపోవడంతో రామరాజు కూతురు అమూల్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. జీడిమెట్ల ప్రాజెక్ట్ కాలనీలో ఉంటున్న ఆమె వచ్చేసరికి ఉదయం10:30 గంటలు దాటింది. రామరాజు తమ్ముడికి చెప్పడంతో డోర్ ఓపెన్ ​చేయడానికి ప్రయత్నం చేయగా కాలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి తలుపులు బద్ధలుకొట్టి లోపలకు వెళ్లారు. ఒక బెడ్ రూమ్‌‌లో రామరాజు ఉరేసుకున్నాడు. మరో బెడ్​రూంలో మాధవి మంచంపై పడి చనిపోయి ఉంది. హాల్‌‌లో శశాంక్ ఉరి వేసుకున్నాడు. అయితే, అంతకుముందే శశాంక్​రాజ్​మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు అక్కడున్న ఆనవాళ్లను బట్టి తెలుస్తున్నది. చావకపోవడంతో అతడు కూడా ఉరేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. మాధవి  ఎలా చనిపోయిందన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు క్లూస్ టీమ్‌‌తో ఆధారాలు సేకరించి.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. 

బాండ్ ​పేపర్‌‌‌‌పై సూసైడ్​ నోట్​

ఘటనా స్థలంలో బాండ్​పేపర్‌‌‌‌పై రాసిన సూసైడ్​ నోట్‌‌ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక ఇబ్బందులు, అప్పులతోనే సూసైడ్​ చేసుకున్నట్టు అందులో రాసినట్టు సమాచారం. అయితే, దీన్ని ఎఫ్ఎస్‌‌ఎల్‌‌కు పంపించి, వారు రాసిందా? కాదా? అన్నది నిర్ధారించుకోవాల్సి ఉన్నది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్‌‌పేట్ ఇన్‌‌స్పెక్టర్ టి. కిరణ్ కుమార్ తెలిపారు.

రెండు రోజుల క్రితమే ఇన్​స్టాలో రీల్..

తమ కింగ్స్ బిర్యానీని ప్రమోట్ చేయడానికి శశాంక్​ ఇన్‌‌స్టా పేజీ నడుపుతున్నాడు. తానూ తన పర్సనల్​ప్రొఫైల్‌‌లో కూడా హోటల్‌‌కు సంబంధించిన కస్టమర్​రివ్యూలు, ప్రమోషన్ ​వీడియోలు చేస్తూ మార్కెటింగ్​చేస్తున్నాడు. అప్పుల నుంచి బయటపడడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో శశాంక్​ రెండు రోజుల క్రితమే ఓ ప్రమోషన్​రీల్​షేర్​చేశాడు. అందులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌‌ భాషల్లో ‘ధమ్​బిర్యానీ కావాలంటే తమ రెస్టారెంట్‌‌కు ఒక్కసారి రావాలని’ అని ప్రమోట్​ చేశాడు. ఇక నుంచి బిర్యానీతోపాటు రీల్స్​కూడా వస్తాయని చెప్పాడు. కానీ అంతలోపే ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది.