- బండి సంజయ్‌కు ఎంపీ చామల వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో మత రాజకీయాలు చేయడం మానుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్‌లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లను హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి గుడికి తీసుకువచ్చిన బండి సంజయ్ మత రాజకీయాలు చేశారని ఆరోపించారు.
ఎవరైనా గుళ్లను దర్శించుకోవడంలో తప్పులేదని.. ఆలయాల వద్ద మత రాజకీయాల గురించి మీడియా ముందు మాట్లాడటంలో ఉన్న ఆంతర్యం ఏమిటని చామల ప్రశ్నించారు. హైదరాబాద్ సిటీలో బీజేపీ ఉనికిని కాపాడేందుకు మత విద్వేషాలు రెచ్చగొట్టాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ మాత్రమే దక్కిందని వెల్లడించారు.
