కీచక లెక్చరర్‌ కి దేహశుద్ధి..

కీచక లెక్చరర్‌ కి దేహశుద్ధి..

కరీంనగర్ జిల్లా  తిమ్మాపూర్ లోని  ఓ ప్రయివేటు  ఇంజినీరింగ్ కాలేజ్ లో.. ల్యాబ్ ఫ్యాకల్టీ వెంకటేశ్ ని  చితకబాదారు  విద్యార్థి సంఘాల నేతలు. సోమవారం ప్రాక్టికల్  ఎక్జామ్ రాస్తుండగా…. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వెంకటేశ్. ఇన్విజిలేటర్ అన్న సంగతి మరిచిపోయి పరీక్ష రాస్తున్న అమ్మాయి పట్ల కంత్రీబుద్దిని చూపించాడు. అమ్మాయి బాగుందని అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఫోన్‌ నెంబర్‌ కావాలని వేదించాడు.

లెక్చరర్‌ వెకిలిచేష్టలపై ఆ కాలేజ్‌ ఛైర్మన్‌ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో.. ఇదే  విషయంపై విద్యార్థి సంఘాల నేతలకు ఫిర్యాదు చేశారు స్టూడెంట్స్. దీంతో  కాలేజ్ కి  వచ్చిన స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ల్యాబ్ ఫ్యాకల్టీని కొట్టారు. తప్పు చేసినట్లు ఒప్పుకుంటూ  క్షమాపణ లేఖ  రాసిచ్చాడు ల్యాబ్ ఫ్యాకల్టీ  వెంకటేశ్. విషయం తెలుసుకున్న పోలీసులు ప్యాక్టల్టీని అదుపులోకి తీసుకున్నారు.