లెజెండ్ ఆర్టిస్ట్..కేఎం వాసుదేవన్​ నంబూద్రి

లెజెండ్ ఆర్టిస్ట్..కేఎం వాసుదేవన్​ నంబూద్రి

ఆయన చిత్రాలు అనుబంధాలను గుర్తుచేస్తాయి. ఆలోచింపచేస్తాయి. మధ్యతరగతి కుటుంబాల జీవన విధానాన్ని కళ్లకు కడతాయి. నాటి తరం మొదలుకొని నేటి తరాల మధ్య ఉండే అంతరాలను తెలియజేస్తాయి. మనషుల జీవన విధానం, కల్చర్​, ఆచారాలు, కళలు, సినిమాలు, సాహిత్యం ఏ జానర్​ అయినా.. తనదైన స్టయిల్​లో చిత్రాలు గీస్తాడు. అందుకే ఆయన లెజెండ్​ ఆర్టిస్ట్​. 1925లో పుట్టిన కేఎం వాసుదేవన్​ నంబూద్రి పెయింటర్​, స్కల్ప్చర్​, లైన్​ ఆర్టిస్ట్​, ఆర్డ్​ డైరెక్టర్​. కేరళలోని సుకపురం టెంపుల్​ ఆయన్ను ఆర్టిస్టుగా మార్చేసింది. ఆ టెంపుల్​పై శిల్పాలు, బొమ్మలు చిత్రకళ వైపు మళ్లించాయి. మద్రాస్​ స్కూల్​లో ఫైన్​ ఆర్ట్స్​ చేసిన ఆయన ‘లైన్​ స్కెచ్​’ ఆర్టిస్ట్​గా పేరు తెచ్చుకున్నాడు. ‘రేఖాచిత్రంగల్​’ స్కెచెస్​కు గాను ఆయనకు 2003లో రాజా రవి వర్మ అవార్డు వచ్చింది. కొన్ని సినిమాలకు ఆర్ట్​ డైరెక్టర్​గా కూడా పనిచేశారు. తన బొమ్మలతో మలయాళం, సాహిత్య పుస్తకాలకు రూపం ఇచ్చాడు. చక్కని కార్టూన్​ బొమ్మలు గీసి సాహిత్యాన్ని మరింత దగ్గర చేశాడు. చిత్రకళే జీవితంగా బతుకుతున్న ఆయన ఇంటికివెళ్తే.. తెల్లని గడ్డం, కళ్లజోడు ధరించి, కాన్వాస్​పై బొమ్మలు గీస్తూ ఒక కామన్​మెన్​లా కనిపిస్తాడు.