V6 News

భార‌త్ కు ఫుట్‌బాల్ క‌ప్ సాధించిపెట్టిన కెప్టెన్ క‌న్నుమూత‌.. BCCI నివాళి

భార‌త్ కు ఫుట్‌బాల్ క‌ప్ సాధించిపెట్టిన కెప్టెన్ క‌న్నుమూత‌.. BCCI నివాళి

ఇండియ‌న్ ఫుట్ బాల్ టీమ్ కు కెప్టెన్ గా సేవ‌లందించిన లెజండ‌రీ ప్లేయ‌ర్ చున్నీ గోస్వామి (82) క‌న్నుమూశారు. కొన్నేళ్లుగా దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కోల్ క‌తాలోని ఓ ఆస్ప‌త్రిలో గుండెపోటుతో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఆయ‌న‌కు భార్య, కుమారుడు ఉన్నారు.

ఫుట్ బాల్, క్రికెట్.. రెండింటిలోనూ ప్ర‌తిభ‌

ఇండియ‌న్ ఫుట్ బాల్ టీమ్ లో లెజండ‌రీ ప్లేయ‌ర్ చున్నీ గోస్వామి. 1956- 64 మధ్య దాదాపు 50 ఫుట్ బాల్ మ్యాచులు ఆడారు. 1962లో ఆయ‌న కెప్టెన్సీలోనే భార‌త్ ఆసియా గేమ్స్ లో కప్ సాధించింది. ఆ త‌ర్వాత ఆయ‌న బెంగాల్ క్రికెట్ బోర్డ్ లో ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ ప్లేయ‌ర్ గా మార‌డం విశేషం. ఇందులోనూ ఆయ‌న త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. 1971-72 రంజీ ట్రోఫీలో బెంగాల్ టీమ్ కు కెప్టెన్ గా ఫైన‌ల్ చేర్చారాయ‌న‌. గోస్వామి మృతి ప‌ట్ల ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సంతాపం ప్ర‌క‌టించాయి.