అబిడ్స్, వెలుగు: హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నాంపల్లిలోని నాలుగో అదనపు సెషన్స్‌కోర్టు తీర్పు వెల్లడించిందని బండ్లగూడ సీఐ దేవేందర్ తెలిపారు. 2023 జనవరి 18న రాత్రి ముంతాజ్‌బాగ్‌లోని విద్యుత్ కార్యాలయం సమీపంలో ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్మార్చురీకి తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జల్‌పల్లి, బాలాపూర్‌కు చెందిన కూలీ వేముల రాజును నిందితుడిగా తేల్చి, కోర్టులో ఛార్జిషీట్ వేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి సోమవారం శిక్ష ఖరారు చేశారు.
