లింగాపూర్ అత్యాచార ఘటన: సమతగా పేరు మార్పు

లింగాపూర్ అత్యాచార ఘటన: సమతగా పేరు మార్పు

ఇటీవల లింగాపూర్ మండలంలో మహిళపై జరిగిన అత్యాచార బాధితురాలి పేరును సమతగా మార్చారు. 24-11-2019న లింగాపూర్ మండల్, ఎల్లప్ప టూర్ గ్రామ శివారులో మహిళను మానభంగం చేసి హత్య చేశారు ముగ్గురు వ్యక్తులు. కేసులో బాధితురాలు పేరును సమతగా మార్చామని.. అన్ని మీడియా రిపోర్టులో బాధితురాలి పేరును సమతగా ఇవ్వాలని సూచించారు పోలీసులు. కేసు నమోదు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు  వెంటనే పరిశోధనను నిర్వహిస్తూ. కేసుకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యాధారాలు స్వీకరించడం జరిగిందన్నారు. కేసు బాధ్యులైన ముగ్గురు నిందితులను వెంటనే అరెస్టు చేసి వారి దగ్గరి నుండి భౌతిక సాక్ష్యాధారాలు సేకరించామని చెప్పారు.

వారికి మెడికల్ పరీక్షలు నిర్వహించి సంబంధిత ప్రభుత్వ వైద్యుల నుండి రిపోర్టు తీసుకోవడం జరిగిందన్నారు.  ఫోరెన్సిక్ పైన్స్ అధికారుల కూడా ఇలాంటి కేసులో పంపించిన భౌతిక సాక్ష్యాధారాలు పరీక్షను వెంటనే నిర్వహించి, రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరామన్నారు. రిపోర్ట్ రెండ్రోజుల్లో పరిశోధనాధికారికి వచ్చే అవకాశం ఉందని..కేసును జిల్లా ఎస్పీ, కొమురం భీం ఆసిఫాబాద్ ఒక సవాలుగా తీసుకున్నారన్నారు. సాక్ష్యాధారాలు సేకరిస్తూ కేసును సీరియస్ గా తీసుకున్నామని తెలిపారు. ఈ వారాంతానికి కోర్టు ముందు అన్ని ఆధారాలు చార్జిపీట్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. కోర్టు విచారణ జరపడానికి జిల్లా కలెక్టర్ ద్వారా ఒక నివేదిక పంపటం జరిగిందన్నారు. మృతురాలి భర్త కు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతి నెలా పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారన్నారు.