ఐపీఎల్ 2024: పంత్ వచ్చేశాడు.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల లిస్ట్ ఇదే

ఐపీఎల్ 2024: పంత్ వచ్చేశాడు.. ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల లిస్ట్ ఇదే

ఐపీఎల్ 2024 లో ఢిల్లీ జట్టుకు మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. యాక్సిడెంట్ కారణంగా ఐపీఎల్ 2023 కు దూరమైన పంత్..  2024 ఐపీఎల్ కు సిద్ధమవుతున్నాడు. పంత్ తో పాటు మొత్తం 16 మంది ప్లేయర్లను ఢిల్లీ జట్టు అట్టిపెట్టుకుంది. ఇక స్టార్ ప్లేయర్లయిన  రిలీ రోసౌవ్, చేతన్ సకారియా, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండేలతో పాటు 11 మంది ప్లేయర్లను ఆ జట్టు వదిలేసుకుంది.   
      
ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్:

రిషబ్ పంత్, ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగి ఎన్గిడి, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్మ్, ఇషాంత్ శర్మ, యశ్ ధుల్, ముకేష్ కుమార్.

ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్ల లిస్ట్:

రిలీ రోసౌవ్, చేతన్ సకారియా, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజుర్ రెహమాన్, కమలేష్ నాగర్‌కోటి, రిపాల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియాం గార్గ్