‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు, లిటిల్ హార్ట్స్’ సినిమాలతో సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది తెలుగమ్మాయి శివాని నాగరం. ప్రస్తుతం ఈ అమ్మడు, వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. ఇటీవల సుహాస్ నటించిన హే బలవంత్ ద్వారా మరోసారి ప్రేక్షకులను పలకరించిన ఈ కుర్ర బ్యూటీ అనుకోకుండా వివాదంలో చిక్కుకుంది.
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తిరుమలలో తనకు 15 నిమిషాల పాటు స్వామివారి దర్శనం కలిగిందని శివాని చెప్పింది. అంతేకాకుండా, ఆ పావుగంట ఓవైపు గోవింద నామాలు వినిపిస్తుంటే.. మరోవైపు ‘కాత్యాయనీ భోంచేశావా’ అని ‘లిటిల్ హార్ట్స్’ సినిమా పాట పల్లవిని కొందరు వినిపిస్తూ ఉన్నారని చెప్పడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. సెలబ్రిటీలకు తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే శివానీ ఓ వీడియో విడుదల చేసి పూర్తి క్లారిటీ ఇచ్చింది. స్వామి వారి దర్శనం చేసుకున్నప్పుడు లైన్లో స్టార్ట్ అయిన దగ్గర నుండి స్వామివారికి దగ్గరగా వెళ్ళేవరకూ మొత్తంగా 15 నిమిషాల దర్శనం అయింది అన్నాను, తప్ప 15 నిమిషాలు నన్నెవరూ టచ్ చేయలేదని కాదని క్లారిటీ ఇచ్చింది. శివాని వివరణతో ఈ అంశంపై వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది
శివాని వీడియోలో మాట్లాడుతూ, “ఇటీవల యూట్యూబ్‌లోని ఒక ప్రైవేట్ ఛానల్‌కు పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నా చైల్డ్‌హుడ్ జర్నీ, సక్సెస్, డివోషనల్ మరియు స్పిరిచువల్ అనుభవాల గురించి ప్రశ్నలు అడిగారు. నేను నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని షేర్ చేసుకున్నాను. కేదార్‌నాథ్, రామకోటి రాయడం, శిరిడీ వెళ్లడం వంటి విషయాలతో పాటు తిరుపతి గురించి కూడా మాట్లాడాను. అందులో 15 నిమిషాల దర్శనం అంశం ఎక్కువగా హైలైట్ అయింది. దీనిపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.
►ALSO READ | ViRosh Wedding: వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న
2025 అక్టోబర్‌లో నేను, మా అమ్మ కలిసి ఎయిర్‌పోర్టులో లైన్‌లో నిలబడి రూ.10,500 శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకున్నాం. ఇందుకు సంబంధించిన ఆధార్ కార్డులు, ఇతర ప్రూఫ్స్ అన్నీ మా వద్ద ఉన్నాయి. తిరుమల ఆలయంలో క్యూ లైన్‌లో మొదటి నుంచి స్వామి దగ్గరకు వెళ్లేంత వరకు కొంచెం కొంచెం స్వామి వారు కనిపిస్తుంటారు. నేను ఆ సమయం ఆ మొత్తం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను.
అంతే కానీ 15 నిముషాలు నన్ను ఎవరూ టచ్ చేయలేదు అని కాదు” అని వెల్లడించింది. శివాని వివరణతో ఈ అంశంపై వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె విడుదల చేసిన క్లారిటీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, సామాన్య భక్తులకు సెకను పాటు దర్శనం కూడా కష్టమవుతుండగా, ఒక హీరోయిన్‌కు 15 నిమిషాల ప్రత్యేక దర్శనం అంటే ఎవ్వరికైనా ఇది అన్యాయమే అనిపిస్తోంది. ఇక్కడ 'సెలబ్రిటీ హోదా వల్లే 15 నిమిషాల దర్శనం' జరిగిందన్న వ్యాఖ్యలతో శివాని వివాదంలో పడింది.
