జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జార్ఖండ్ లోని దియోబంద్‌లోని జసిదిహ్, మధుపూర్ మధ్య రోహిణి-నవాడిహ్ రైల్వే క్రాసింగ్ దగ్గర గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ బియ్యం లోడుతో వెళ్తున్న ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గురువారం ( జనవరి 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఉదయం 9:38 గంటల ప్రాంతంలో గోండా నుండి అసన్సోల్‌కు ప్రయాణిస్తున్న రైలు పట్టాలు దాటుతుండగా డౌన్ లైన్‌లో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో రెండు లైన్లలో రైళ్ల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. తరువాత రైల్వే అధికారులు అప్ లైన్‌లో ట్రాఫిక్‌ను పునరుద్ధరించి అసన్సోల్-ఝఝా ప్యాసింజర్ రైలుకు లైన్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఘటన జరిగిన సమయంలో క్రాసింగ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. క్రాసింగ్ దగ్గర రద్దీ కారణంగా రైలుకు సిగ్నల్ ఇవ్వలేదని, అయినప్పటికీ అది డౌన్ లైన్‌లోకి వచ్చి ట్రక్కును ఢీకొట్టిందని గేట్ కీపర్ తెలిపారు.
देवघर: जसीडीह में बड़ा रेल हादसा टला. नावाडीह रेलवे फाटक पर गोंडा–आसनसोल एक्सप्रेस की चावल लदे ट्रक से जोरदार टक्कर हुई, जिससे कुछ समय के लिए अप और डाउन दोनों लाइनें प्रभावित रहीं. राहत की बात यह रही कि घटना में कोई हताहत नहीं हुआ. फिलहाल अप लाइन से ट्रेन परिचालन शुरू कर दिया गया… pic.twitter.com/XJzLOKS0ex
— Prabhat Khabar (@prabhatkhabar) January 22, 2026
►ALSO READ | రీల్స్ దబాంగ్ అమ్మాయి.. క్రైం హిస్టరీ చూస్తే మైండ్ బ్లాంక్.. ఇప్పుడు జైల్లో ఎందుకుంది..?
ఘటన జరిగిన సమయంలో రెండు బైకులు కూడా ట్రక్కును ఢీకొన్నాయి. అయితే, రైడర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, RPF సిబ్బంది, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
झारखंड के देवघर में ट्रेन और ट्रक के बीच टक्कर, हादसे में 2 बाइक सवार घायल pic.twitter.com/h7aFT5UOLB
— Shahnawaz Sadique (@shahnawazsadiqu) January 22, 2026
