సోషల్ మీడియాలో దబాంగ్ గర్ల్.. దబాంగ్ అమ్మాయి అని చాలా ఫేమస్.. రీల్స్ చేస్తూ ఇన్ స్ట్రాలో లక్షల మంది ఫాలోవర్స్.. ఇక యూపీ గోరఖ్ పూర్ లో అయితే దబాంగ్ అమ్మాయి తెలియని వాళ్లు లేరు.. ఇప్పుడు ఈ బుజ్జి జైల్లో ఉంది.. అన్షిక అలియాస్ దబాంగ్ అమ్మాయిగా పాపులర్ అయిన ఈ బుజ్జి.. ఓ బర్త్ డే పార్టీలో తుపాకీతో ఒకడ్ని కాల్చింది.. అరెస్ట్ తర్వాత అమ్మడు క్రైం రికార్డ్ చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు.. మైండ్ బ్లాంక్ అయ్యే దబాంగ్ గర్ల్ అలియాస్ అన్షిక క్రైం హిస్టరీని ఆసక్తిగా తెలుసుకుందామా...
దబాంగ్ అమ్మాయి క్రైమ్ రికార్డ్ చూసి పోలీసులు కూడా షాకయ్యారంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి.. జనవరి 20న, స్నేహితులతో కలిసి బర్త్ డే పార్టీలో ఉన్న సమయంలో అన్షిక ఒక ప్రైవేట్ ఆసుపత్రి మేనేజర్ ను గన్ తో బెదిరించిందని... ఈ క్రమంలో జరిగిన గొడవలో, మేనేజర్ స్నేహితుడి కడుపులో కాల్పులు జరపగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
►ALSO READ | వాచ్లో వంతారా.. అనంత్ అంబానీ కోసం రూ.12.5 కోట్లతో తయారీ.. దీని గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు!
ఈ సంఘటన తర్వాత, పోలీసులు అన్షికను అరెస్ట్ చేశారు. అరెస్టు తర్వాత, పోలీసులు అన్హిక మొబైల్ ఫోన్, డిజిటల్ రికార్డులను పరిశీలించినప్పుడు, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి... ఆమె మొబైల్ ఫోన్లో వీడియోలు, కాల్ రికార్డులు సేకరించారు పోలీసులు. అన్షిక వీడియో కాల్స్ ద్వారా జనాన్ని బ్లాక్ మెయిల్ చేసేదని గుర్తించారు పోలీసులు.
అన్షిక, ఆమె భర్త బంటీ వర్మ తుపాకీ చూపించి రూ.12 వేల రూపాయలు, తరువాత రూ. 50వేలు డిమాండ్ చేశారని, డబ్బు చెల్లించకపోతే తనను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారని ఆరోపించారు ద్వివేది చైల్డ్ కేర్ హాస్పిటల్ మేనేజర్ విశాల్ మిశ్రా. అన్షిక పేరు గతంలో వాహనాల చోరీ, నకిలీ నంబర్ ప్లేట్ కేసులో బయటపడిందని తెలిపారు పోలీసులు.
ఢిల్లీ నుండి అద్దెకు తీసుకున్న వాహనాన్ని తిరిగి ఇవ్వకపోవడం, వివిధ రాష్ట్రాల లైసెన్స్ ప్లేట్లతో దానిని ఉపయోగించడం వంటి అభియోగాలు కూడా దర్యాప్తులో వెల్లడయ్యాయని తెలిపారు పోలీసులు.మొబైల్ డేటా, కాల్ లిస్ట్, లావాదేవీలు, సోషల్ మీడియా ఆధారంగా అన్షిక నెట్వర్క్ పై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాధితుల ఫిర్యాదులు, డిజిటల్ ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు పోలీసులు.
