ఢిల్లీ నడి రోడ్లపై ఓ ఫారిన్ వుమెన్ నానా హంగామా సృష్టించింది. రోడ్డుపక్కన మురికికాల్వలో నడుస్తూ వింతగా ప్రవర్తించింది. ఏదో పూనకం వచ్చినదానిలా ఊగిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక ఆమె వింత చేష్టలు చూసేందుకు జనం పెద్ద ఎత్తున గుమికూడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.
ఢిల్లీలోని మహిపాల్పూర్ సమీపంలో NH48 రహదారిపై ఓ విదేశీ మహిళ రోడ్డు పక్కన మురుగు కాలువలో నడుస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఈ అసాధారణ ఘటనను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడటంతో, రద్దీగా ఉండే ఆ రహదారిపై హైడ్రామా నెలకొంది. ప్రాథమిక రిపోర్టు ప్రకారం.. ఆ మహిళ మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నట్లు కనిపించింది. మహిళకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియలేదు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ఆ మహిళ ఎందుకు అలా ప్రవర్తించిందనే దానిపై స్పష్టత లేదు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉందన్నది కూడా నిర్ధారణ కాలేదు. ఆమె వివరాలు, ఘటనకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో వీడియో చూసి ఊహాగానాలు చేయడం కంటే, ఆమె పరిస్థితిని గుర్తించి అవసరమైన వైద్య సహాయం అందించడమే ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
A shocking video surfaced on NH 48 near Mahipalpur Delhi showing a foreign woman walking inside a roadside drain. High drama unfolded on the busy highway as commuters gathered to witness the unusual incident. Initial reports suggest she appeared to be in an altered state of consciousness
— Ramesh Speaks (@rameshofficial0) October 17, 2026
