‘18 పేజెస్’ బ్లాక్ బస్టర్.. చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్

‘18 పేజెస్’ బ్లాక్ బస్టర్.. చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ‘నిఖిల్’ వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతున్నాడు. ‘కార్తికేయ’ చిత్రంతో కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ ను అందుకున్న నిఖిల్.. రీసెంట్‌గా ‘18 పేజెస్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో నిఖిల్ తో పాటు చిత్ర యూనిట్ లో ఫుల్ జోష్ నెలకొంది. అందులో భాగంగా చిత్ర నిర్మాణ సంస్ధ స్పెషల్ పార్టీ ఇచ్చింది.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో కలిసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్ డ్యాన్స్ చేసి అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు. నిఖిల్ కూడా స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై సినిమా తెరకెక్కింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ నమోదు చేసుకుంది.