ఇసుక లారీ బీభత్సం..ఒకరి మృతి

ఇసుక లారీ బీభత్సం..ఒకరి మృతి

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇసుక  లారీ బీభత్సం సృష్టించింది. స్పీడుగా వచ్చిన లారీ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బైపాస్ రోడ్ లో బైక్ ను ఢీకొంది. దీంతో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు.  మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఆగకుండా వెళ్లిన లారీ  చౌరస్తాలో జీపును ఢీ కొట్టింది. జీపులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు లారీని అడ్డుకోవడంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.