నిద్రమత్తులో డ్రైవర్..  ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

నిద్రమత్తులో డ్రైవర్..  ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ


తిమ్మాపూర్, వెలుగు: డ్రైవర్​నిద్రమత్తులోకి జారుకోగా.. లారీ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన కరీంనగర్ లోని అలుగునూర్​లో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపునకు వస్తున్న లారీ డ్రైవర్​ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో రాజీవ్ రహదారిపైనున్న రెయిలింగ్​ను ఢీకొట్టి అదే వేగంతో రోడ్డు పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో లారీ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగగా స్థానికులు ఆర్పివేశారు. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.  సుమారు రూ.8 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు జాప మధుసూదన్ రెడ్డి తెలిపారు.