రైతుల నిరసనలతో టోల్ ప్లాజాలకు కోట్లలో నష్టం

రైతుల నిరసనలతో టోల్ ప్లాజాలకు కోట్లలో నష్టం

న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతుల వల్ల హైవేల్లోని టోల్ ప్లాజాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అన్నదాతల ఆందోళనల వల్ల సుమారుగా ప్రతి రోజు రూ.1.8 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. కొన్ని టోల్ ప్లాజాలను నిలివివేశామని, యూజర్ల నుంచి టోల్‌‌ రుసుమును వసూలు చేయలేకపోతున్నామని తెలిపారు. రైతుల నిరసనల వల్ల పంజాబ్, హర్యానాతోపాటు ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్‌‌లో గత డిసెంబర్ నుంచి టోల్ కలెక్షన్స్‌‌ను నిలిపివేశారు.