గ్రేట్ లవ్ స్టోరీ : వాళ్లిద్దరూ హత్యలు చేసి జైలుకెళ్లారు.. అక్కడే పుట్టిన ప్రేమ.. ఇప్పుడు పెళ్లి..!

గ్రేట్ లవ్ స్టోరీ : వాళ్లిద్దరూ హత్యలు చేసి జైలుకెళ్లారు.. అక్కడే పుట్టిన ప్రేమ.. ఇప్పుడు పెళ్లి..!

ప్రేమ ఎప్పుడు, ఎక్కడ.. ఎలా పుడుతుందో ఎవరికి తెలుసు.. ప్రేమ ఫలానా రోజు.. ఫలానా వ్యక్తితోనే పుడుతుంది అని ఏమీ లేదు.. ఎప్పుడు.. ఎక్కడైనా.. ఎవరిపైన అయినా పుడుతుంది అనటానికి ఈ ఇన్సిడెంట్ సాక్ష్యం. అవును.. వాళ్లిద్దరూ మర్డర్లు చేశారు.. అలా ఇలా కాదు.. అత్యంత కిరాతకంగా నమ్మిన మనుషులనే చంపేశారు.. ఆ తర్వాత జైలుకు వెళ్లారు. తీర్పు వచ్చింది.. వీళ్లిద్దరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు.. వేర్వేరు కేసుల్లో జైలుకు వచ్చిన వీళ్లిద్దరికీ ప్రేమ పుట్టింది.. అది పెళ్లి వరకు వెళ్లింది.. ఈ ఆసక్తికర అంశంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ పేరు ప్రియా సేథ్. వయస్సు 34 ఏళ్లు. డేటింగ్ యాప్ లో దుష్యంత్ శర్మతో పరిచయం. ఇద్దరూ తరచూ కలిసేవారు. కొన్ని రోజుల తర్వాత దుష్యంత్ శర్మ శవం అయ్యి కనిపించాడు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సిటీ శివార్లలో దొరికిన సూట్ కేసులో శర్మ డెడ్ బాడీ ఉంది. విచారణ చేస్తే ప్రియాసేథ్ చంపినట్లు గుర్తించారు పోలీసులు. మత్తు మందు ఇచ్చి చంపిన తర్వాత.. డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి పడేసినట్లు విచారణలో స్పష్టం అయ్యింది. ఇక కోర్టు ప్రియాసేథ్ కు జీవిత ఖైదు శిక్ష విధించింది. 

ఇక జైలు వరుడు విషయానికి వస్తే 29 ఏళ్ల హనుమాన్ ప్రసాద్. అల్వార్ ఏరియాలో తన ముగ్గురు కుమారులను, మేనల్లుడిని 2017లో అత్యంత కిరాతకంగా చంపాడు. విచారణ తర్వాత జీవిత ఖైదు విధించింది కోర్టు. అతన్ని జైపూర్ జైలుకు తరలించారు పోలీసులు.

రాజస్థాన్ రాష్ట్రంలోనే హై ప్రొఫైల్ కేసులుగా ఉన్నాయి ఈ రెండు. ఈ కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ప్రియాసేథ్, ప్రసాద్ జైలులోనే లవ్ లో పడ్డారు. జైపూర్ లోని ఓపెన్ ఎయిర్ జైలులో వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అది పెళ్లి వరకు వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

వీరి పెళ్లి ప్రసాద్ స్వగ్రామం అల్వార్ జిల్లా బరోడామియోలో జరిగింది. పెళ్లి కోసం వీళ్లిద్దరూ పెరోల్ అప్లయ్ చేశారు. పెరోల్ మంజూరు కావటంతో.. ప్రసాద్ స్వగ్రామంలో ఈ పెళ్లి జరిగింది. ఏదిఏమైనా హత్యలు చేసినోళ్లకు ప్రేమ ఉంటుంది.. వాళ్లకు మనస్సు ఉంటుంది అంటున్నారు నెటిజన్లు. కాకపోతే ప్రియాసేథ్ లవర్ ను చంపేస్తే.. ప్రసాద్ కడుపున పుట్టిన పిల్లలనే చంపేశాడు.. జైలు జీవితం వాళ్లకు కొత్త ప్రేమను.. కొత్త జీవితాన్ని ఇచ్చింది.