నైన్త్ క్లాస్‌‌ బాలుడు.. ఇంటర్‌‌ అమ్మాయి మధ్య ప్రేమ.. గర్భం దాల్చిన బాలిక, ఇంట్లో నుంచి ఇద్దరు పరార్‌‌

నైన్త్ క్లాస్‌‌ బాలుడు.. ఇంటర్‌‌ అమ్మాయి మధ్య ప్రేమ.. గర్భం దాల్చిన బాలిక, ఇంట్లో నుంచి ఇద్దరు పరార్‌‌

జడ్చర్ల, వెలుగు: ప్రేమించుకుని పెండ్లి చేసుకుందామని చెప్పి ఓ 15 ఏండ్ల బాలుడు, 17 సంవత్సరాల బాలికను గర్భవతిని చేశాడు. ఈ ఘటన మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా జడ్చర్ల మండలంలో మంగళవారం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జడ్చర్ల మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక ఇంటర్‌‌ ఫస్ట్‌‌ ఇయర్‌‌ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇద్దరు ప్రేమించుకొని పెండ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో బాలిక గర్భవతి అయింది. దీంతో ఇద్దరూ 15 రోజుల కింద ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు.

బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌‌ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఇద్దరు మైనర్లు కోయిలకొండ మండలకేంద్రంలో ఉన్నట్లు గుర్తించి, మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకొని జువైనల్‌‌ కోర్టులో హాజరుపరిచారు.