
రాష్ట్రంలో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. LPG వంట గ్యాస్ సరఫరాలను మెరుగుపర్చేందుకు కర్ణాటకలోని హసన్ నుంచి హైదరాబాద్ లోని చర్లపల్లి బాట్లింగ్ యూనిట్ వరకు పైప్ లైన్ నిర్మాణాన్ని HPCL చేపట్టనుంది. 680 కిలో మీటర్ల పైప్ లైన్ కోసం రూ.2,200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశముంది.