CSK vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో.. రచీన్ రవీంద్ర ఔట్

CSK vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో.. రచీన్ రవీంద్ర ఔట్

ఐపీఎల్ లో నేడు(ఏప్రిల్ 23) మరో ఆసక్తికర సమరం  జరగనుంది. లక్నో సూపర్ జయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు జట్లు కూడా ఆడిన 7 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్ల మధ్య ఈ సీజన్ ఒక మ్యాచ్ జరగ్గా.. లక్నో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. మరోవైపు చెన్నై జట్టులో రచీన్ రవీంద్ర స్థానంలో మిచెల్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. 

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

క్వింటన్ డి కాక్, KL రాహుల్ (వికెట్ కీపర్, కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్