హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్తో ఉత్తరాది, దక్షిణాది రాష్ర్టాల మధ్య చాలా తేడా ఉంటుందని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ విషయాన్ని 1956 లోనే అంబేద్కర్ పార్లమెంట్ లో చెప్పారని గుర్తుచేశారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఆయన ఫొటోకు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నార్త్ లో పెద్ద రాష్ర్టాలను ఏర్పాటు చేసి దక్షిణాదిన చిన్న రాష్ర్టాలను మిగిలిస్తే దేశ సమతుల్యత దెబ్బతింటుందని, ఇది దేశానికి ప్రమాదకరమన్నారు.
డీలిమిటేషన్ చేస్తున్న తీరుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఇతర రాష్ర్టాల సీఎంలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ చెప్పినట్లుగా సమతుల్యత దెబ్బతినకుండా, ఫెడరల్ వ్యవస్థకు నష్టం జరగకుండా డీలిమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

