ఒలింపిక్స్‌కు మానా పటేల్.. తొలి భారత స్విమ్మర్‌గా రికార్డు

ఒలింపిక్స్‌కు మానా పటేల్.. తొలి భారత స్విమ్మర్‌గా రికార్డు

న్యూఢిల్లీ: భారత స్విమ్మర్ మానా పటేల్ కొత్త రికార్డు సృష్టించింది. జపాన్‌లోని టోక్యోలో త్వరలో జరగబోయే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు మానా అర్హత సాధించింది. తద్వారా మన దేశం నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా స్విమ్మర్‌గా, ఓవరాల్‌గా మూడో భారత్ స్విమ్మర్‌గా అరుదైన ఘనతను సాధించింది. అహ్మదాబాద్‌కు చెందిన బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మర్ అయిన మానా.. శ్రీహరి నటరాజ్, సంజన్ ప్రకాశ్‌తో కలసి భారత్ తరఫున ఒలింపిక్స్‌కు డైరెక్ట్ ఎంట్రీ కొట్టింది. మానా ప్రదర్శనపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు హర్షం వ్యక్తం చేశారు. ఇదే ప్రదర్శనను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్లు రిజిజు ట్వీట్ చేశారు. 21 ఏళ్ల మానూ జాతీయ గేమ్స్‌లో బ్యాక్‌స్ట్రోక్‌లో గోల్డ్ మెడల్స్ నెగ్గడం విశేషం.