స్కానింగ్ ఆపరేటర్ వికృత చేష్టలు

స్కానింగ్ ఆపరేటర్ వికృత చేష్టలు
  • మహిళలపై లైంగిక వేధింపులు
  • వీడియోలపై కలెక్టర్ ఆగ్రహం
  • నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం

 నిజామాబాద్‌:డయాగ్నోస్టిక్ సెంటర్​లో స్కానింగ్ చేసే  కంప్యూటర్ ఆపరేటర్​ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. స్కానింగ్ చేసే సమయంలో మహిళల వీడియోలు తీసి బెదిరస్తూ లైంగిక వేధింపులకు గురి చేశాడు. నిజామాబాద్ పట్టణంలో  అయ్యప్ప స్కానింగ్ సెంటర్ నడుస్తోంది. ఈ క్రమంలో  స్కానింగ్‌కు వచ్చే మహిళలు, యువ తు ల న్యూడ్ ఫొటోలు, వీడియోలను వారికి తెలియకుండా ఆపరేటర్ ప్రశాంత్  చిత్రీకరించేవాడు.  అనంతరం వాటిని మహిళలకు చూపించి లైంగిక వేధిం పులకు గురి చేస్తూ బెదరించడం మొదలుపెట్టాడు. తన మాట వినని మహిళల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేయడంతో  అవి వైరల్ అయ్యాయి.

ఈ క్రమం లో ఓ మహళకు ఆమె న్యూడ్​ ఫోటోలను పంపడంతో షాక్​కు గురైంది.  దీంతో బాధితులు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు కు ఫిర్యాదు చేశారు.  న్యూడ్ ఫోటోల చిత్రీ కరణపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్​వోకు కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్​ఆదేశాలతో జిల్లా వైద్యశాఖ అధికారులు అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కు నోటీసులు జారీ చేశారు. బాధిత మహిళ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని అతని సెల్ ఫోన్ ను పరిశీలిస్తున్నారు.