తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు

తెలంగాణా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆర్టీఓ కార్యాలయాల్లో, బోర్డర్ చెక్ పోస్ట్ లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్,  సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలపై ముకుముడిగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్స్ చేశారు. ఆర్టీఓ ఏజెంట్లును, ఆఫీసర్లు విచారిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్ట్, ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం బోరజ్ చెక్ పోస్టుల దగ్గర ఎసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు కొనసాగుతుంది. మహబూబాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో  పది మంది ఏజెంట్లను ఏ.సి.బి అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆర్టీఓ ఆఫీసులో పత్రాలను డిటేల్ గా పరిశీలిస్తున్నారు.