ఫ్రిజ్ లోనే కుళ్లిపోయిన కూరగాయలు, నిమ్మకాయలు

 ఫ్రిజ్ లోనే  కుళ్లిపోయిన కూరగాయలు, నిమ్మకాయలు

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీపై స్పెషల్ టీముల తనిఖీలు కొనసాగుతున్నాయి.  మేడ్చల్ జిల్లా పరిధిలోని తాజా హాలీడే బ్రేక్ ఫాస్ట్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్టోర్ రూమ్లో ఫుడ్ కలర్స్ను గుర్తించారు అధికారులు. కూరగాయలు, నిమ్మకాయలు పూర్తిస్థాయిలో కుళ్లిపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఎలాంటి లేబుల్ లేని టీ పౌడర్, పురుగులు పట్టి పూర్తి స్థాయిలో పాడైన కొర్రలను గుర్తించారు. హోటల్లో పనిచేసే వారికి ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్స్ కూడా లేవు. వట్టినాగులపల్లి లోని ప్రిజమ్ రెస్టారెంట్ అండ్ బార్ లోనూ తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాలం చెల్లిన పలు ఫుడ్ ఐటమ్స్ ను గుర్తించారు. కుళ్లిపోయిన కూరగాయలను చాలా కాలంగా ఫ్రిజ్ లో స్టోర్ చేసినట్లుగా గుర్తించారు.  కిచెన్ లో  వాటర్ దుర్వాసన రావడాన్ని అధికారులు గుర్తించారు.