యానిమల్, ఛావా లాంటి బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన రష్మిక మందన్న.. త్వరలో ‘కాక్ టైల్ 2’ చిత్రంలో మరోసారి ఉత్తరాది ప్రేక్షకులను పలకరించబోతోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్‌తో కలిసి ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. శుక్రవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జూన్ 19న సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్‌లో షాహిద్ స్టైలిష్ లుక్‌లో కనిపించగా.. రష్మిక, కృతి గ్లామరస్ లుక్‌తో ఇంప్రెస్ చేశారు. ఈ నెల 18న టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు రివీల్ చేశారు.
రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్ 2’ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లలో ఈ టీజర్‌ను జత చేయనున్నట్లు సమాచారం. హోమి అడాజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘కాక్ టైల్’కి ఇది సీక్వెల్. అర్జున్ రాంపాల్, డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండను పెళ్లాడిన రష్మికకు.. పెళ్లి తర్వాత విడుదలవుతున్న తొలిచిత్రం ఇదే కానుంది. ఇక ప్రస్తుతం విజయ్‌కు జంటగా ‘రణబాలి’ అనే చిత్రంలో ఆమె నటిస్తోంది. అలాగే ‘మైసా’ అనే లేడీ ఓరియెం టెడ్ మూవీ కూడా చేస్తోంది.
