హైదరాబాద్ , వెలుగు: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలంగాణ ఆర్టీసీపై పడదని, రాష్ట్రంలో ఆర్టీసీకి డీజిల్ కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం ఆర్టీసీ ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. ప్రతి నెలా ఆర్టీసీకి ఎప్పటికప్పుడు డీజిల్ సరఫరా కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఆర్టీసీకి కోటీ 28 లక్షల లీటర్ల డీజిల్ అవసరమని, యుద్ధం వల్ల లీటర్ కు ఒక్క రూపాయి ధర పెరిగినా రూ.1.28 కోట్ల అదనపు భారం పడే అవకాశముందని తెలిపారు. అయినా భవిష్యత్తు పరిణామాలపై ఆందోళన చెందకుండా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంస్థను సమర్థవంతంగా నడపడంపైనే దృష్టి కేంద్రీకరించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
