బాబోయ్.. బాత్‌రూమ్‌లో నుంచి 30 పాము పిల్లలు

బాబోయ్.. బాత్‌రూమ్‌లో నుంచి 30 పాము పిల్లలు

మాములుగానే మనం దూరం నుంచి ఒక పామును చూస్తేనే దడుచుకుంటాం.. అలాంటిది 30 పాములను ఒకేసారి చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహకే భయం పుడుతుంది కదా.. అలాంటిది  ఓ ఇంటి నుంచి కనీసం 30కి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. ఈ ఘటన  అస్సాంలోని నాగోన్ జిల్లాలో  చోటుచేసుకుంది.  తమ బాత్‌రూమ్‌లో పాములు కనిపించాయని స్థానికులు తెలిపారు. 

వెంటనే పాములు పట్టుకునే సంజీబ్ దేకా అనే వ్యక్తికి  సమాచారం ఇవ్వడంతో అతను  వచ్చి  వాటిని సురక్షితంగా తీసురకువెళ్లాడు. వీటికంటే ముందు అతను కలియాబోలోని టీ ఎస్టేట్ నుండి 55 కిలోల కంటే ఎక్కువ బరువున్న 14 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువను రక్షించి తన వెంట తీసుకువెళ్లాడు. స్థానికంగా సంజీబ్ దేకాను  సర్పమ్ మ్యాన్ అని పిలుస్తుంటారు.  ఈ ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు.