ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు

ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్..అతిషీ పై పరువు నష్టం దా వా వేయడంతో ఢిల్లీకోర్టు ఆమెకు మంగళవారం (మే 28) నోటీసులు పంపింది. జూన్ 29న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను కోనేం దుకు బీజేపీ ప్రయత్నించిందని ఢిల్లీ సీఎం చేసిన వ్యాఖ్యలపై కూడా కోర్టు నోటీసులిచ్చింది. 

ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చారు కపూర్. ఆప్ నేతల ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని తెలిపారు.  కోర్టులో కేజ్రీ వాల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ను చూపించారు. బీజేపీ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించిందని, పార్టీ మారడానికి రూ. 25 కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపిం చారు. రాజకీయంగా భవిష్యత్తు ఉండాలంటే బీజేపీలో చేరాలని ఆఫర్ ఇచ్చిందని లేని పక్షంలో ఈడీ ఆమెను అరెస్ట్ చేస్తుందని అతిషీ చేసిన వాదనను కూడా కోర్టులో వినిపించారు. అతిషి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, టీవీ, సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలని బిజెపి నేత తన పిటిషన్‌లో కోరారు.