వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్.. తులం ఎంత ఉందో తెలుసా..?

వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్..  తులం ఎంత ఉందో తెలుసా..?

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయే సరికి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు పసిడి ఆకాశం వైపే చూస్తుంది కానీ ఒక్కసారైన నేలను చూస్తలేదు. కొన్ని సార్లు ఈ బంగారం ధరలు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయని చెబుతున్నారు మధ్య తరగతి ప్రజలు.

 ఇన్ని రోజులు నగల షాపులకు కాపలగా సెక్యురిటీలను పెట్టుకునే వారు.. ఇక నుంచి బంగారం వేసుకున్న ప్రతి ఒక్కరూ సెక్యూరిటీని పెట్టుకోవల్సిన పరిస్థితి వస్తుందేమో అని అనుమానిస్తున్నారు మధ్య తరగతి కుటుంబ సభ్యులు.. ఇంతకు ఇవాళ( మే 28 2024) బంగారం ధరలు ఎలా ఉన్నయో తెలుసా

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 200 పెరిగి రూ. 66 వేల 650 గా ఉంది.  24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 72 వేల 710 గా ఉంది. 
 దేశ వాణిజ్య రాజధాని  ముంబాయిలో 22 క్యారెట్ల బంగారం రూ. 200 పెరిగి రూ. 66 వేల 650 గా ఉంది.  24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 72 వేల 710 గా ఉంది. 
 హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం రూ. 200 పెరిగి రూ. 66 వేల 650 గా ఉంది.  24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 72 వేల 710 గా ఉంది.