Rashmika Mandanna: దయచేసి అలా చేయకండి.. మేము కూడా ఉన్నాం.. రష్మికకు ఫ్యాన్స్ రిక్వెస్ట్

Rashmika Mandanna: దయచేసి అలా చేయకండి.. మేము కూడా ఉన్నాం.. రష్మికకు ఫ్యాన్స్ రిక్వెస్ట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా ఆమె ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. బాలీవుడ్ లో రష్మిక నటించిన యానిమల్ సినిమా భారీ విజయాన్ని సాదించడంతో ఆమెకు అక్కడ కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక తాజాగా ఆమె ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇందులో భాగంగా తెలుగులో మాట్లాడి ఆడియన్స్ ను అలరించారు రష్మిక. 

అయితే.. ఈవెంట్ లో రష్మిక తెలుగులో మాట్లాడటంపై ఆమె నార్త్ ఫ్యాన్స్ కాస్త డిజపాయింట్ అయ్యారట. ఇదే విషయంపై రష్మిక రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్మిక..  ఇటీవల ఈవెంట్ లో మీరు చాలా అందంగా కనిపించారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ, మీరు తెలుగులో మాట్లాడటం వల్ల మాకు అర్థం కాలేదు. నార్త్ లో ఉన్న మీ అబిమానులు కూడా మీ మాటలు వినాలని అనుకుంటారు. అందువల్ల.. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితే బాగుటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం.. అంటూ పోస్ట్ చేశారు. 

ఇదే విషయంపై రష్మిక స్పందిస్తూ.. మీరు ఎక్కడినుండి వచ్చినా మీకు అర్థం అయ్యేలా ఇంగ్లిష్ లో మాట్లాడేందుకు ప్రత్నిస్తాను. కానీ, చాలా మంది స్థానిక భాషలో మాట్లాడాలని కోరుకుంటారు. వారికోసమే అలా మాట్లాడతాను. ఇకమందు అందరికీ అర్థం అయ్యేలా మాట్లాడేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను.. అంటూ రాసుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.