మచ్చబొల్లారంలో చోరీ..30 తులాల బంగారం, వెండి ఆభరణాలు అపహరణ

మచ్చబొల్లారంలో చోరీ..30 తులాల బంగారం, వెండి ఆభరణాలు అపహరణ

అల్వాల్, వెలుగు : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చబొల్లారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. జీఎంఆర్ గార్డెన్ రూట్ ఎస్టేట్ కాలనీలో నివాసముంటున్న రమేశ్​ తన కుటుంబంతో కలిసి శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లాడు. ఈ విషయం గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. సుమారు 30 తులాల బంగారం, వెండి ఆభరణాలు, రూ. లక్ష నగదు, ల్యాప్‌‌టాప్‌‌ను దోచుకెళ్లారు. స్థానికులు రమేశ్​కు సమాచారం ఇవ్వడంతో ఆయన పర్యటనను మధ్యలోనే నిలిపివేసి ఇంటికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. చోరీ అనంతరం ఇద్దరు దొంగలు మరో కాలనీకి చెందిన స్కూటీపై వెళ్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రశాంత్ వెల్లడించారు.