దూరం పెడుతుందనే కత్తితో దాడి చేసిండు

దూరం పెడుతుందనే కత్తితో దాడి చేసిండు

నార్సింగిలో  దాడికి గురైన బాధితురాలికి  షారుక్ సల్మాన్ కు రెండున్నరేళ్లుగా పరిచయం ఉందన్నారు మాదాపూర్ పోలీసులు.  సెలూన్ షాప్లో షారుక్ సల్మాన్ పని చేస్తున్నాడు..అక్కడే బాధితురాలకు పరిచయం అయ్యాడన్నారు. గతంలో కూడా బాధితురాలు ఇంటికి షారుక్ సల్మాన్ వెళ్ళేవాడన్నారు. నిందితుడు షారుక్ సల్మాని కి పెళ్లి అయిందని, ఒక పిల్లవాడు ఉన్నారని భాదితురాలుకు తెలిసిందన్నారు. దీంతో కొన్ని రోజులు నుండి షారుక్ సల్మాన్ ని ఆ యువతి దూరం పెట్టిందన్నారు. తనను  దూరం పెట్టిందనే  కోపంతో నిన్న(మంగళవారం) బాధితురాలు ఇంటికి వెళ్లిన సల్మాన్..మాట మాట పెరిగడంతో కురగాయల కత్తితో దాడి చేశాడన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశామని..రిమాండ్ కు తరలిస్తామన్నారు.