మాదాపూర్, వెలుగు: హైదరాబాద్నగరంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, నాలాలను కబ్జాదారుల నుంచి రక్షించి, పూర్వవైభవం తీసుకువస్తున్న హైడ్రా కమిషనర్రంగనాథ్ను కొనసాగించాలని మాదాపూర్వాసులు కోరారు.
బుధవారం హైడ్రాకు మద్దతుగా తమ్మిడికుంట చెరువు వద్ద శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్‌గౌడ్, ఫిషరీస్ఫెడరేషన్చైర్మన్ మెట్టు సాయికుమార్, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. హైడ్రా ఉండాలి.. చెరువులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. హైడ్రా వల్ల వర్షకాలం ఇబ్బందులు తప్పాయని, వర్షపు నీరు కాలనీల్లోకి చేరకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
