- శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ముమ్మాటికీ జాతిపితనేనని, తెలంగాణ రాష్ట్రం సాధించిన చరిత్ర ఆయనదేనని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి తెలిపారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా ఉంటారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర చీమ కాలంతైనా లేదని చెప్పారు. సీఎం రేవంత్వ్యాఖ్యలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. విద్వేషప్రసంగాలు వద్దని జస్టిస్సుదర్శన్రెడ్డి సూచించినా.. దాన్ని రేవంత్ పట్టించుకోకుండా కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. హార్వర్డ్వెళ్లినా అంతరిక్షం వెళ్లినా రేవంత్ బుద్ధి మారదని వెల్లడించారు.
గ్యారంటీల అమలు వదిలి గారడీల ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. 15 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిందని, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నదో చెప్పేందుకు ఈ ఒక్క వైఫల్యం చాలని చెప్పారు. రేవంత్‌తో తెలంగాణకు అప్పుడైనా..ఇప్పుడైనా ఇసుమంత మేలైనా జరిగిందా అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ లాగా పదవులు త్యాగం చేసిన చరిత్ర ఎవరికైనా ఉందా? అని నిలదీశారు.
