స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌‌‌పై వ్యాఖ్యలు బాధాకరం :  మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ 

స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌‌‌పై వ్యాఖ్యలు బాధాకరం :  మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ 

హైదరాబాద్, వెలుగు: స్పీకర్ గడ్డం ప్రసాద్‌‌‌‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ అన్నారు. ఎమ్మెల్సీ పదవి నుంచి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. “ఇది రాజకీయ విమర్శ కాదు.. ఇది సంస్కారం లేని రాజకీయ భాషకు పరాకాష్ట. ఒక దళితుడు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడనే విషయాన్ని కూడా జీర్ణించుకోలేని అహంకార రాజకీయాలకు నిదర్శనం” అని మండిపడ్డారు.

స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తయితే, ఆయన తల్లిని సైతం అవమానించేలా మాట్లాడటం నీచమైన చర్య అని అన్నారు. రాజకీయ కక్షలు, పార్టీ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నా ఒకరి తల్లిని అవమానించే హక్కు ఎవరికీ లేదన్నారు. రాజకీయంగా విమర్శించడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిఒక్కరికీ హక్కుఉందని, కానీ కులాన్ని, కుటుంబ సభ్యులను అవమానించే స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు.