కేటీఆర్ ఆదేశాలతోనే స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవమానం ..దళితుడిని టార్గెట్ చేస్తూ చేయించిన కామెంట్లకు గుణపాఠం తప్పదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కేటీఆర్ ఆదేశాలతోనే స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవమానం ..దళితుడిని టార్గెట్ చేస్తూ చేయించిన కామెంట్లకు గుణపాఠం తప్పదు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • కట్టప్పలా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కేటీఆర్ వెన్నుపోటు పొడుస్తున్నరని ఆరోపణ

 న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ ఆదేశాలతోనే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మధు... స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. 

దళితుడిని టార్గెట్ చేస్తూ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించిన ఈ కామెంట్లకు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను అవమానిస్తూ... చేసిన శుద్ధీకరణ అంశంపై సోమవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ ఎస్సీ, ఎస్టీ ఎంపీల కీలక సమావేశం జరిగింది.

 తెలంగాణ నుంచి ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య ఈ భేటీలో పాల్గొని, చర్చించారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ... శుద్ధీకరణ అంశంపై ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

దేశవ్యాప్తంగా బీజేపీ అరాచకాలు చేస్తోందని, వాటికి వ్యతిరేకంగా పోరాడటం చేస్తామని చెప్పారు. శుద్ధీకరణ అంశంపై రాష్ట్రపతి అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోరామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకునేదాకా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి కూడా స్వయంగా గుడికి వెళ్తే అవమానపరిచారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

కట్టప్పలా కేటీఆర్ వెన్నుపోటు... 

కేటీఆర్ కట్టప్పలా మారి సొంత పార్టీ ఎమ్మెల్యేలను వెన్నుపోటు పొడుస్తున్నారని వంశీకృష్ణ ఆరోపించారు. హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావును కింద పడేసిందే కేటీఆర్ అని అన్నారు. డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుళ్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేయి చేసుకున్నారని, ఈ ఘటనకు సంబంధించి పూర్తి ఫుటేజ్ ఉందన్నారు. అటెన్షన్ కోసమే కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

పోలీసులపై దాడి చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తోన్న ఆదరణ ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డిపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, దేశంలోని ఎస్సీ సమాజాన్ని తమ కాళ్ల కింద అణచివేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కుల కోసం తాము నిలబడుతున్నామన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం తాము పోరాడుతామని వంశీకృష్ణ స్పష్టం చేశారు. 

దళితుడు కాబట్టే హేళన: మల్లు రవి

స్పీకర్ స్థానంలో ఉన్నది ఒక దళిత నేత కాబట్టే కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రవర్తించారని క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

శాసనమండలి చైర్మన్ వెంటనే ఆ రికార్డులను పరిశీలించి తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ సర్కార్..దళితులను అంటరాని వారిగా చూస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.