యూపీ నుంచి మాఫియాను తరిమికొట్టాం

యూపీ నుంచి మాఫియాను తరిమికొట్టాం

సమాజ్ వాదీపార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోణలు చేశారు. యూపీలో మాఫియా జైళ్లలో లేదా ఎస్పీ అభ్యర్థుల జాబితాలో మాత్రమే దొరుకుతుందని విమర్శించారు. అత్రౌలిలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ..సమాజ్ వాదీ పార్టీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు. యూపీలో మాఫియా కోసం వెతికితే మూడు చోట్ల మాత్రమే కనిపిస్తుంది. ఒకటి జైలు, మరొకటి రాష్ట్రం వెలుపుల మూడోది ఎస్పీ అభ్యర్థుల లిస్ట్ లో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అఖిలేష్, మాయావతి ప్రభుత్వాల్లో గూండాలు రెచ్చిపోయి రాష్ట్ర ప్రజలను వేధించారని ఆరోపించారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యోగి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ నుంచి మాఫియాను తరిమికొట్టారన్నారు షా.

మరిన్ని వార్తల కోసం

ఐదేళ్లలోపు చిన్నారులకు త్వరలోనే టీకా !

ప్రజల మద్దతు తమకే ఉందన్న ఎస్పీ చీఫ్