ఐదేళ్లలోపు చిన్నారులకు త్వరలోనే టీకా !

ఐదేళ్లలోపు చిన్నారులకు త్వరలోనే  టీకా !

ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా టీకా వేసేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల పసికందు నుంచి నాలుగేళ్ల చిన్నారులకు కరోనా​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ FDA కు ఫైజర్‌ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తమ కొవిడ్‌ టీకాకు ఇచ్చిన అత్యవసర వినియోగ అనుమతిని సవరించి 6నెలల పసికందు నుంచి నాలుగేళ్లలోపు చిన్నారులను కూడా చేర్చాలని FDAను కోరినట్లు ఫైజర్‌ తెలిపింది. ఎఫ్​డీఏ అనుమతి లభిస్తే చిన్నారులకు అందుబాటులోకి వచ్చిన తొలిటీకాగా ఫైజర్‌ నిలవనుంది.

కరోనా కారణంగా అమెరికాలో ఆస్పత్రుల్లో చేరుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిందని ఫైజర్‌ తెలిపింది. భవిష్యత్‌ వేరియంట్లను ఎదుర్కొనటంతో పాటు వైరస్‌ నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను కాపాడుకునేందుకు FDAతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పింది. ఆరు నెలల చిన్నారులకు ఇచ్చే టీకా.. పెద్దలకు ఇచ్చే దానిలో పదో వంతు మాత్రమే ఉంటుందని ఫైజర్ చెప్పింది.

మరిన్ని వార్తల కోసం..

కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ పై దాడి