రిమ్స్ లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు : జైసింగ్​ రాథోడ్​

రిమ్స్ లో అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు : జైసింగ్​ రాథోడ్​
  • అన్ని విభాగాల్లో  డాక్టర్ల పోస్టులు భర్తీ చేశాం
  • అధునాతన మెషినరీ తెచ్చాం 
  • ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని రిమ్స్​సూపర్​స్పెషాలిటీ దవాఖానలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని రిమ్స్​డైరెక్టర్​ డా.జైసింగ్​రాథోడ్​ తెలిపారు. సోమవారం రిమ్స్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దవాఖానలో ఇది వరకు పీడియాట్రిక్​సర్జన్, న్యూరోసర్జన్​ మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం అన్ని విభాగాల్లో డాక్టర్లను భర్తీ చేశామని చెప్పారు.

 సర్జిక్​ఆంకాలజీ, యూరాలజిస్ట్,​ కార్డియాలజీ, ప్లాస్టిక్​ సర్జన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గతంలో రిమ్స్​జనరల్​హాస్పిటల్​లో100 ఎంబీబీఎస్​సీట్లు  మాత్రమే ఉండేవని, ఈడబ్ల్యూఎస్​కింద మరో 20 పెరిగాయన్నారు. మరో 50 సీట్లు పెంచడానికి ప్రపోజల్స్​పంపామన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రిమ్స్​కు 72 పీజీ సీట్లు అలాట్​చేస్తుందని..పీజీ సీట్లు పెంచాలని ఉన్నతాధికారులను కోరగా, వారు సానుకూలంగా స్పందించారని చెప్పారు. 

సర్వైకల్​క్యాన్సర్​తో బాధపడుతున్న వారి కోసం మెమోగ్రఫీ అందుబాటులోకి వచ్చిందన్నారు. అల్ర్టాసౌండ్​స్కానర్​కూడా ఉందన్నారు. కీళ్ల, మోకాళ్ల సర్జరీలు సైతం చేస్తున్నామని చెప్పారు. త్వరలో ఎమ్ఆర్​ఐ ప్రారంభించబోతున్నామని తెలిపారు. సూపరింటెండెంట్​డా.మహ్మద్​ఇద్రిస్​అక్బానీ, నోడల్​ఆఫీసర్​డా.కల్యాణ్​రెడ్డి, ఆర్ఎమ్ఓ చంపత్​రావు పాల్గొన్నారు.