మ్యాపింగ్ లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో మానుకోట :  కలెక్టర్ స్నేహ శబరీశ్ 

మ్యాపింగ్ లో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో మానుకోట :  కలెక్టర్ స్నేహ శబరీశ్ 

మహబూబాబాద్, వెలుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌)కు ముందస్తు సన్నాహాల్లో భాగంగా మ్యాపింగ్ లో రాష్ట్రంలో మానుకోట జిల్లా ముందంజలో నిలిచినట్లు కలెక్టర్ స్నేహ శబరీశ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్​లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో 92.24 శాతం మ్యాపింగ్ చేసి, రాష్ట్రంలోనే ముందువరుసలో ఉందన్నారు.

2002, 2025 రెండు ఓటరు జాబితాల్లోనూ పేర్లు ఉంటే ఓటర్లు ఆధారాల కోసం ఎలాంటి ధ్రువపత్రాలు చూపాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్‌‌‌‌లో ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. ఎస్ఐఆర్ సవరణ కోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ అనిల్​కుమార్​, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు మార్నేని వెంకన్న, సురేశ్ నాయుడు, శ్యామ్ లోయ శర్మ, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.