సీఎం ఏక్​నాథ్ షిండే కేబినెట్ విస్తరణ.. అజిత్ పవార్​కు ఆర్థిక శాఖ

సీఎం ఏక్​నాథ్  షిండే కేబినెట్  విస్తరణ.. అజిత్ పవార్​కు ఆర్థిక శాఖ

ముంబై: నేషనలిస్ట్  కాంగ్రెస్  పార్టీ(ఎన్సీపీ) తిరుగుబాటు లీడర్  అజిత్  పవార్​కు సీఎం ఏక్ నాథ్  షిండే కేబినెట్​లో కీలకమైన ఆర్థిక శాఖ ఇచ్చారు. ప్రణాళిక శాఖ బాధ్యతలు కూడా ఆయనే చూస్తారు. షిండే తన కేబినెట్​ను శుక్రవారం విస్తరించారు. ఎన్సీపీలో తిరుగుబాటు చేసి శివసేన బీజేపీ ప్రభుత్వంలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు షిండే కేబినెట్​లో చోటు దక్కింది. 

చగన్  భుజ్ బల్​కు ఆహార, పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల హక్కుల రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధరం రావ్ బాబా ఆత్రంకు డ్రగ్  అండ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​డీఏ), దిలీప్  వాల్సే పాటిల్ కు సహకార శాఖ, ధనంజయ్ ముండేకు వ్యవసాయ శాఖ ఇచ్చారు. ఇక హసన్  ముష్రిఫ్​కు వైద్యవిద్య శాఖ, అనిల్  పాటిల్ కు రిలీఫ్​ అండ్  రిహబిలిటేషన్, విపత్తు నిర్వహణ, అదితి తత్కారేకు మహిళ, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు.

 క్రీడలు, యువజన సంక్షేమ, ఓడరేవుల శాఖను సంజయ్  బన్సోడే చేపట్టనున్నారు. కాగా, గత నెలలో అజిత్  పవార్  నేతృత్వంలోని 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆ తొమ్మిది మందికి తాజాగా షిండే  కేబినెట్​లో చోటు దక్కింది.