మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌
  • ఖానాపూర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌‌‌‌‌‌‌‌పైఆగ్రహంతోనేనని విమర్శలు 
  • ఎస్పీ శరద్‌‌‌‌‌‌‌‌చంద్ర పవార్‌‌‌‌‌‌‌‌ రేఖా నాయక్‌‌‌‌‌‌‌‌ అల్లుడు

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ శరద్‌‌‌‌‌‌‌‌చంద్ర పవార్‌‌‌‌‌‌‌‌ను సడెన్​గా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆయన్ను తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ అకాడమీకి బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో గుండేటి చంద్రమోహన్‌‌‌‌‌‌‌‌ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాజకీయ కారణాల వల్లే శరద్‌‌‌‌‌‌‌‌ చంద్ర పవార్‌‌‌‌‌‌‌‌ను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేశారని విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ శరద్‌‌‌‌‌‌‌‌చంద్ర పవార్‌‌‌‌‌‌‌‌ ఖానాపూర్​ఎమ్మెల్యే రేఖానాయక్‌‌‌‌‌‌‌‌కు స్వయాన అల్లుడు. 

ఇటీవల ప్రకటించిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌‌‌‌‌‌‌‌ పేరు లేకపోవడంతో ఆమె హైకమాండ్‌‌‌‌‌‌‌‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఆమె కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అధికార పార్టీ సంగతి తేలుస్తానంటూ ప్రకటించారు. ఆమె ప్రకటన వచ్చిన గంటలోనే శరద్‌‌‌‌‌‌‌‌చంద్ర పవార్‌‌‌‌‌‌‌‌ను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎస్పీని ఎన్నికల వ్యవహారాలతో సంబంధం లేని పోస్ట్‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.