భారీ మెజార్టీపై ఫోకస్‍ పెట్టిన మజ్లిస్‍ పార్టీ

భారీ మెజార్టీపై ఫోకస్‍ పెట్టిన మజ్లిస్‍ పార్టీ

 

హైదరాబాద్, వెలుగు:మజ్లిస్ కంచుకోటగా ఉన్న హైదరాబాద్  లోక్ సభ స్థానం నుంచి ఈసారి భారీ మెజార్టీ సాధించేందుకు  పార్టీ సన్నద్ధమైంది. మజ్లిస్ నేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేసిందే తడువుగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు ఈ స్థా నం కంచుకోటగా ఉండేది. ఎంఐఎం అగ్రనేత, అససుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఎప్పుడైతే రాజకీయ అరంగ్రేట్రం చేశారో నాటి నుంచి నేటి వరకుఈ సీటు మజ్లిస్‍ ఖాతాలోనే ఉంది. కానీ ఓట్లశాతం తక్కువగా ఉంటోంది. దీంతో పోలింగ్‌‌ శాతం పెంచేందుకు ఆ పార్టీ దృష్టి సారించిం ది.1984లో సుల్తాన్‌‌ సలావుద్దీన్‌‌ ఒవైసీ కేవలం 0.6శాతం ఓట్ల తేడాతో గెలుపొందారు. క్రమంగా పెరుగుతూ వస్తున్న పోలింగ్‌‌ శాతం మజ్లిస్‌‌కు కలిసి వస్తోంది. మూడున్నర దశాబ్దాలుగా పాతబస్తీపై గట్టి పట్టు సాధించి ఎన్నికలను ఏకపక్షంగా మార్చినప్పటికీ ఆశించిన స్థా యిలో మెజార్టీ రాకపోడం పార్టీకి మింగుడుపడని అంశంగామారిం ది. ప్రతిసారి పోలింగ్‌‌ పర్సంటేజ్‍ 50నుంచి 60 శాతం మధ్యనే ఊగిసలాడుతుండటాన్ని ఆ పార్టీ నాయకత్వం పసిగట్టిం ది. ఈసారి భారీ విజయాన్ని నమోదు చేసుకునేందుకు,పోలింగ్‌‌ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిం చి ప్రణాళికలు రూపొదించిం ది.

బూత్ కు మహిళలు వచ్చేలా అవగాహన

మరోవైపు పాతబస్తీలో పురుష ఓటర్లతో పోల్చితే మహిళల పోలింగ్‌‌ శాతం చాలా తక్కువగా నమోదవుతోం ది. కట్టుబాట్లు, ఇతరత్రా కారణాలతో ప్రత్యేక సమయం కేటాయించి బయటకివెళ్లి ఓటింగ్‌‌లో పాల్గొనేం దుకు ఇక్కడి మహిళలు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. మజ్లిస్‌‌  ఈసారిమహిళా ఓటర్లపై  ప్రత్యేక దృష్టి సారించిం ది.మహిళలను చైతన్య పరిచేందుకు సిద్ధమైంది. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళల సమస్యలపై  గ్రూప్‌ ల వారీగా చర్చిం చాలని భావిస్తుం ది. తాజాగా అసదుద్దీన్ పాదయాత్రల ద్వా రా పోలింగ్‌‌ శాతం పెంచాలని భావించారు.ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. బస్తీలు, కాలనీలలో తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు. ఎంపీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆరింట్లో విజయ ఢంకా మోగించి హవాను కొనసాగించిం ది. ఒక్క గోషామహల్ నుంచి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విజయం సాధించగా చాం ద్రాయణగుట్ట, మలక్ పేట, కార్వా న్, బహదూర్ పుర, చార్మినార్, యాకుత్ పురా నియోజకవర్గాలలో సిట్టింగ్ అభ్యర్థులే గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ కు తిరిగి పట్టం కట్టిన ఓటర్లు ఒక ఎత్తయితే, అధికారంలో ఉన్న టీఆర్‍ఎస్ అండ ఈసారి తోడయ్యింది. గత ఎంపీ ఎన్నికల్లో 52 శాతం పోలింగ్‌‌ నమోదు కాగా, ఈసారి అసెంబ్లీ ఎన్నికలు లేకపోవడంతో పూర్తిస్థా యిలో దృష్టిసారిం చి భారీ మెజారిటీ సాధించాలని మజ్లిస్‍ చూస్తుంది

టాక్‍ విత్‍ అసదుద్దీన్‍’తో ముందుకు

ఇప్పటివరకు ఇతర పార్టీలు మజ్లిస్ కు గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. వరుసగా నాలుగోసారి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 2014లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి భగవంతరావుపై 2,02,454 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.  ఒవైసీకి మొత్తం 5,13,868 ఓట్లు రాగా, భగవంతరావుకు 3,11,414 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణా రెడ్డి 49,310 ఓట్లతో, టీఆర్ఎస్ అభ్యర్థి రషీద్ షరీఫ్‍ 37,195 ఓట్లు తెచ్చుకుని డిపాజిట్  కోల్పోయారు.  ప్రతిసారి ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్‌ శాతం పెరగడంలేదు. దీంతో ఈసారి ఎంఐఎం కొత్తగా నమోదైన ఓటర్లతోపాటు మిగతా ఓటర్లు పోలింగ్​బూత్ కు వచ్చేదానిపై నజర్ పెట్టిం ది. యువ ఓటర్లతో మాట్లాడేందుకు లెర్న్‌‌ ప్రాజెక్టును ప్రారంభించిం ది. దీని ద్వారా కాలేజీ విద్యార్థులతో ‘టాక్‌ విత్‌‌ అసదుద్దీన్‌‌’ పేరుతో ఫేస్ టు ఫేస్ ను షూరు చేసింది. ఇప్పటికే రెండు టౌన్‌‌ హాల్‌ కార్యక్రమాలను నిర్వహించింది.