- మంత్రి అజారుద్దీన్, అడిషనల్ డీజీకి మజ్లిస్ ఎమ్మెల్యేల వినతి
హైదరాబాద్, వెలుగు: బాన్సువాడ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిందితుల పై కఠినచర్యలు తీసుకోవాలని, నిర్దోషులను విడుదల చేయాలని మజ్లిస్ ఎమ్మెల్యేలు డిమాం డ్ చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఇటీవల జరిగిన కమ్యూనల్ ఇన్సిడెంట్ పై మజ్లిస్- ఎమ్మెల్యేల బృందం మజ్లిస్ ఎమ్మెల్యేల బృందం మైనార్టీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్‌తో సమావేశమై మెమోరాండం సమర్పించారు.
ఈ ఘట నలో నిర్దోషులైన మైనారిటీ యువకులను వెం టనే విడుదల చేయాలని, మరిన్ని అరెస్టులను ఆపాలని, దెబ్బతిన్న షాపు యజమానులకు తగి న పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యేల బృందం కోరింది. ఆ ప్రాంతంలో సామరస్యం కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మైనారిటీ వెల్ఫేర్ మంత్రి అజరుద్దీన్‌ను కోరారు
