బాంబే హౌజరీలో ఫైర్ యాక్సిడెంట్..కాలి బూడిదైన రూ. కోట్ల విలువ చేసే బట్టలు  

బాంబే హౌజరీలో ఫైర్ యాక్సిడెంట్..కాలి బూడిదైన రూ. కోట్ల విలువ చేసే బట్టలు  

చార్మినార్​ వెలుగు: హైకోర్టు ఎదురు గల్లీలోని మదీనా మార్కెట్​సునీత టెక్స్​టైల్స్ వద్ద​ ఉన్న బాంబే హోజరీ హోల్‌‌‌‌సేల్ షాప్​, గోడౌన్​లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ బిల్డింగ్​ మూడంతస్తుల్లో ఉంది. ఇక్కడ మూడు షట్టర్లలో బాంబే హోజరీకి చెందిన షాపులు, గోదాములు ఉన్నాయి. మిగతా ఏడు షట్టర్లలో ఇతర వ్యాపారులు బట్టల వ్యాపారం చేస్తున్నారు..

సోమవారం ఉదయం ఐదు గంటలకు షార్ట్​​సర్క్యూట్​తో ఒక్క సారిగా మంటలు చెలరేగడం, లోపల భారీగా బట్టల స్టాక్​ ఉండడంతో కోట్లాది రూపాయల విలువైన బట్టలు కాలిపోయాయి. సుమారు ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఫైర్​ఫైటర్స్ ​ఐదు ఫైరింజన్లతో  కొన్ని గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. చార్మినార్​ పోలీసులు రంగంలో దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జుల్ఫికర్​అలీ బాధితులను పరామర్శించారు.