కాలానికి తగ్గట్టుగా మేకప్​

కాలానికి తగ్గట్టుగా మేకప్​

మేకప్​ ప్రొడక్ట్స్ ను కూడా సీజన్కు తగ్గట్టు సెలక్ట్​ చేసుకోవాలి. మరి ఈ మాన్ సూన్కు ఎలాంటి ప్రొడక్ట్స్​ బెస్ట్​ అంటే.. 

  • ఈ కాలం క్రీమ్​ బేస్డ్​ మేకప్​ ప్రొడక్ట్స్​, ఫౌండేషన్స్, బ్లష్​, ఐ–షాడోలకి దూరంగా ఉండాలి. ​ అలాగే ఐ–లైనర్​ నుంచి లిప్​స్టిక్​ వరకు అన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాటర్​ ప్రూఫ్​లో దొరుకుతున్నాయి. ఇవి వేసుకుంటే వర్షంలో తడిసినా మేకప్​  పోదు. అందుకే ఈ కాలం వాటర్​ ప్రూఫ్​ మేకప్​ ప్రొడక్ట్స్​ మాత్రమే ఎంచుకోవాలి. 
  • కాలమేదైనా సరే  సన్స్క్రీన్  ప్రొటక్షన్​ అవసరం. మాయిశ్చరైజర్​ కూడా తప్పనిసరి. అయితే ఈ వానాకాలం వాటర్​ బేస్డ్​  లేదా వాటర్​ ప్రూఫ్​ మాయిశ్చరైజర్​, సన్​ స్ర్కీన్​ లోషన్స్​ ఎంచుకోవాలి​. చర్మాన్ని ఎప్పటికప్పుడు క్లెన్సింగ్​ చేసుకోవాలి. ఒకవేళ చర్మం జిడ్డుగా అవుతుంటే పండ్లతో తయారుచేసిన ఫేస్​ ప్యాక్​లు వేసుకోవాలి.
  • వర్షాకాలంలో తడిసిన జుట్టుని అలానే వదిలేస్తే చుండ్రు సమస్య వేధిస్తుంది. అందుకే  ఈ కాలంలో జుట్టుపై ఎక్కువ దృష్టి పెట్టాలి.  వర్షంలో తడిసిన ప్రతిసారి మైల్డ్​ షాంపూతో తలస్నానం చేయాలి. హెర్బల్​ షాంపూలు వాడటం మరీ మంచిది. అలాగే ఈ కాలంలో హెయిర్​ స్ప్రేలు, జెల్​లు, బ్లో డ్రయర్స్​ వాడొద్దు. వర్షం వల్ల వెంట్రుకల కుదుళ్లు పాడవకుండా ఉండాలంటే డీప్​ ఫ్రీజ్​ సీరమ్​లను వాడాలి.  ఈ సీజన్​లో  హెయిర్​ స్టయిల్​ను సింపుల్​గా చేసుకోవాలి. తలస్నానానికి ముందు జుట్టుకి వెనిగర్ పట్టిస్తే జుట్టు మెరుస్తుంది. అలాగే ఈ సీజన్​లో  హెయిర్​ స్టయిల్​ను సింపుల్​గా ఉండేలా చూసుకోవాలి.
  • ఈ కాలం ఐ– మేకప్​కి దూరంగా ఉండటం బెటర్​. కంపల్సరీ అనుకుంటే ఐ– లైనర్​ ఒక్కటి వాడితే సరిపోతుంది​. ఈ కాలం పాదాల ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలి.